నకిలీ విత్తనాల పట్టివేత, నిషేధిత పిచికారి మందు సీజ్

నమస్తే హైద్రాబాద్ తిరుమలగిరి:

జిల్లా టాస్క్
ఫోర్స్,తిరుమలగిరి,అర్వపల్లి పోలీసుల అధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52కిలోల నకిలీ పత్తి విత్తనాలు,300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాదినం చేసుకొని,ఇద్దరి నింధితులను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీసులు.వ్యవసాయానికి,రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నకిలీ విత్తనాలు విక్రయిస్తే పి‌.డి యాక్ట్ నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు.రెండు కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్,నలుగురు పరారిలో వున్నారని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల నివారణకోసం,గుర్తింపు కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా టాస్క్ ఫోర్స్ టీమ్ పని చేస్తుందన్నారు.వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నామని గతంలో ఈ రకమైన నేరాలకు పాల్పడ్డ నిందితులపై కూడా దృష్టి పెట్టినట్లు,అలవాటుగా నకిలీ విత్తనాల సరఫరా చేస్తూ నేరాలకు పాల్పడితే పి.డి యాక్ట్ తప్పదు అని ఎస్పి హెచ్చరించారు.సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నింధితుడిని,ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును విక్రయిస్తున్న మరో నిందితుడినీ తిరుమలగిరి పోలీసులు మంగళవారం రోజున అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారని తెలిపారు.సుమారు 1,25,౦౦౦/- లక్షల విలువైన 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు,మూడు లక్షల యాబై వేల రూపాయల ( 3,50,000 ) విలువగల ౩౦౦ లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నమన్నారు.తిరుమలగిరి పట్టణానికి చెందిన సంకేపల్లి సోమిరెడ్డి వయస్సు 53 సం లు మరియు ఈదుల పర్రె తండ చెందిన గుగులోత్ ప్రేమ్ కుమర్ వయస్సు 29 సం లు, గల నిందితులు అంధ్రప్రదేశ్‌,కర్నాటక,మహరాష్ట్ర రాష్ట్రాలకు భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తు ప్రస్తుతం పరారీలో వున్న నాగ మల్లేశ్వర్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి నుండి తిరుమలగిరికి చెందిన అనంత రెడ్డి అనే వ్యక్తీ నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కోనుగోలు చేసి,నింధితులు సోమిరెడ్డి,ప్రేము లకు అమ్మగా వారు అట్టి నకిలీ విత్తనాలను అధిక ధరలకు రైతులకు అమ్మడం కోసం ఈ పత్తి విత్తనాలు గ్లయ్పొసెట్‌ గడ్డి మందుకు తట్టుకోనే శక్తి కలిగి వుండటంతో పాటు పత్తి దిగుబడి అధికమని,ఎక్కువమార్లు కలుపు తీయాల్సిన అవసరం లేదని,స్థానిక డీలర్ల వద్ద ఈ విత్తనాలు లభ్యం కావని మోసపూరిత తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను నమ్మించి నకిలీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయించేందుకు పాల్పడగా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో తిరుమలగిరి పోలిసులు నిందితుల ఇండ్లలో దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు,ప్రభుత్వ నిషేధిత ౩౦౦ లీటర్ల గడ్డి మందును స్వాదినం చేసుకుని ఇద్దరి నింధితులను అదుపులోకి తీసుకున్నామని తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ గౌడ్ తెలిపారు.నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌ అన్నదాతను నమ్మించి మోసం చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని,ఎవరైన నకిలీ విత్తనాలను,విక్రయించిన,సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని.ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే 8712686026 వాట్సప్‌ నంబర్‌కు సమచారం అందించాలని,సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులో బాగా పని చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు.జిల్లా పోలీసు కార్యలయంలో నిర్వహించిన పత్రికా విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే,తో పాటు సూర్యాపేట డీఎస్పీ రవి,నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి,అర్వపల్లి ఎస్సైలు సత్యనారాయణ,యాకూబ్,సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles