థైరాయిడ్‌తో హైరానా

థైరాయిడ్‌ మన శరీరంలోని కీలకమైన గ్రంథుల్లో ఒకటి. ఇది మన శరీరంలో చాలా జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది.
అంతేకాదు మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ముఖ్యపాత్ర థైరాయిడ్‌దే. ఒకవేళ థైరాయిడ్‌ గ్రంథి సరిగ్గా పనిచేయలేని పరిస్థితి వచ్చిందంటే అది మన శరీరం మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం థైరాయిడ్‌ రుగ్మతలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా తలెత్తే థైరాయిడ్‌ సమస్యలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.ఆరోగ్యకరమైన జీవనశైలితో బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. కానీ, థైరాయిడ్‌ విషయంలో అలాంటి వెసులుబాటు లేదంటున్నారు వైద్యులు. ప్రజల్లో అవగాహన కొరవడటంతో రోజురోజుకూ థైరాయిడ్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ఈ పరిస్థితుల్లో అసలు థైరాయిడ్‌ అంటే ఏంటి? థైరాయిడ్‌ సమస్యలు, వాటివల్ల కలిగే అనర్థాలు? చికిత్స తదితర అంశాలపట్ల అవగాహన కలిగి ఉండాలి.

థైరాయిడ్‌… మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ప్రధానమైన గ్రంథి. ఈ గ్రంథి నుంచి థైరాయిడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన శరీరం పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎదగడానికి అంటే… మెదడు అభివృద్ధికి, ఎత్తు పెరగడానికి, బాలికల్లో అయితే రజస్వల కావడానికి, స్త్రీలలో నెలసరి, గర్భం దాల్చడం ఇలా వివిధ శరీర జీవక్రియల్లో థైరాయిడ్‌ గ్రంథిదే కీలకపాత్ర. పిల్లలు ఎత్తు పెరగడం లేదంటే అది థైరాయిడ్‌ గ్రంథిలో ఏదైనా లోపం కావచ్చు. బాలికలు రజస్వల కాలేదంటే థైరాయిడ్‌ సమస్య కావచ్చు. లేదా మహిళలు గర్భం దాల్చడంలో అవరోధాలు ఏర్పడుతున్నాయంటే అక్కడ కూడా థైరాయిడ్‌ సమస్యనే ముందుండొచ్చు.

అందుకని గర్భధారణ సమస్యలు వచ్చిన స్త్రీలకు మొట్టమొదటగా థైరాయిడ్‌ పరీక్షలు చేయిస్తారు. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో ఏర్పడే లోపాలు లేదా సమస్యలనే థైరాయిడ్‌ సమస్యలుగా లేదా వాడుక భాషలో థైరాయిడ్‌ ఉన్నట్టుగా పేర్కొంటారు. ప్రధానంగా థైరాయిడ్‌లో మూడు రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, రెండోది హైపర్‌థైరాయిడిజం, మూడోది థైరాయిడ్‌ క్యాన్సర్‌. సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే థైరాయిడ్‌ను నియంత్రణలో ఉంచవచ్చు. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారికి ఎలాంటి పథ్యం అవసరం ఉండదు. అన్ని రకాల ఆహార పదార్థాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

హైపోథైరాయిడిజం
థైరాయిడ్‌ గ్రంథి నుంచి వెలువడే హార్మోన్‌ స్థాయులు రక్తంలో సాధారణం కంటే తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ సమస్యను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

బరువు పెరగడం
నీరసంగా, డల్‌గా ఉండడం
వెంట్రుకలు ఊడిపోవడం
మహిళల్లో నెలసరి సక్రమంగా రాకపోవడం
గర్భధారణ సమస్యలు
మెడ దగ్గర వాపు
పిల్లల్లో…

ఎత్తు పెరగకపోవడం
రజస్వల ఆలస్యంగా కావడం లేదా త్వరగా కావడం
మెదడు అభివృద్ధి చెందకపోవడం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles