Rythu Bharosa | రైతు భరోసా ఏదీ?.. పెట్టుబడి సాయంపై ప్రభుత్వ కార్యాచరణ నిల్‌

వానకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు.. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పప్రారంభమైన వానకాలం..రైతుల ఎదురుచూపులు
ఈ సీజన్‌లో ఎప్పుడిస్తారన్నదానిపై లేని స్పష్టత
కొత్త నిబంధనలు పెడతామన్న సీఎం రేవంత్‌
కౌలు రైతుల గుర్తింపుపైనా కొరవడిన స్పష్టత
కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ
Rythu Bharosa | హైదరాబాద్‌, జూన్‌ 6(నమస్తే తెలంగాణ): వానకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు.. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కొరవడింది. పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. దీంతో ఎప్పటినుంచి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. యాసంగి మాదిరిగానే పంట కోతలు పూర్తయ్యాక ఇస్తారా? లేక సీజన్‌కు ముందే ఇస్తారా? గతంలో మాదిరిగా రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు ఇస్తారా? రైతుభరోసా కింద రూ.7,500 ఇస్తారా? అనే అంశాలపై స్పష్టత కరువైంది.ష్టత కొరవడింది. పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు.
గత వానకాలం సీజన్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం జూన్‌ 26న రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీని ప్రారంభించి, దాదాపు నెలన్నరలోనే మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ సీజన్‌లో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. అయితే, ముగిసిన యాసంగి సీజన్‌లో రైతుబంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్‌ ప్రభు త్వం.. వానకాలం సీజన్‌ను నుంచి రైతుభరోసాను అమలుచేస్తామని తెలిపింది. రైతుభరోసాకు నిబంధనలు మారుస్తామని, సాగు చేసిన భూములకే ఇస్తామని, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి కార్యచరణ ప్రారంభం కాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు జరిగేదెప్పుడు? రైతుభరోసాపై చర్చించేదెప్పుడు? నిబంధనలు ఖరారు చేసేదెప్పుడు? పెట్టుబడి సాయం అందించేదెప్పుడు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కౌలు రైతులపై స్పష్టత కరువు
ప్రతి సీజన్‌లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభానికి ముందే అర్హులైన కొత్త రైతులను కూడా ప్రభుత్వం జాబితాలో చేర్చేది. ఇందుకోసం పంపిణీకి పది, పదిహేను రోజుల ముందు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేవారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కొత్త రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles