Pawan Kalyan: జనసేన ఘన విజయానికి పది కారణాలు..

Pawan Kalyan
పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.. జనసేన ఒక పార్టీనా అంటూ ఎంతోమంది ఐదేళ్ల క్రితం హేళన చేశారు. ఎదుటివారి విమర్శలకు కుంగిపోలేదు. వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయ రణరంగంలో వెనక్కి పారిపోలేదు. ఓడిపోయానంటూ హేళనచేసినవారికి తగిన గుణపాఠం చెబుతానంటూ సవాల్ విసిరారు. అరాచక పాలనతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వైసీపీని అథ పాతాళానికి తొక్కేస్తానంటూ సవాల్ విసిరారు. పవన్ సవాల్‌ను ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. రాజకీయాల్లో నిలకడలేని వ్యక్తి అంటూ ఎగతాళి చేశారు. పోటీచేస్తున్న స్థానాల్లో సగం కూడా గెలవలేరంటూ హేళనచేసినా.. అన్నింటిని భరించి.. తాను ఎంటో ఎన్నికల ఫలితాలతో నిరూపించాడు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసిన జనసేన ఒకేఒక నియోజకవర్గంలో విజయం సాధించింది. గెలిచిన తర్వాత ఆ ఒక ఎమ్మెల్యే వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టార్గెట్ 2024 పెట్టుకుని పనిచేశారు పవన్. వైసీపీని ఓడించాలంటే తన పార్టీ బలం సరిపోదని ఎన్డీయే కూటమిలో చేరి బీజేపీతో జట్టుకట్టారు. ఆ రెండు పార్టీలు కలిసినా ఏపీలో వైసీపీని ఓడించి అధికారంలోకి రాలేమని గ్రహించిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వబోనని సవాల్ చేశాడు. దీనిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుకు యత్నించి.. చివరికి సఫలమయ్యాడు. పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీచేసి .. అన్ని స్థానాల్లో గెలిచింది. దీంతో పవన్ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో పవర్‌స్టార్‌గా మారాడు. అతడిని విమర్శించిన వాళ్లే ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు జనసేన ఘన విజయానికి కారణాలు ఏమిటో తెలుసుక

1. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు కలిసివచ్చింది. ఒంటరిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికారపార్టీకి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు జనసేనకు కలిసివచ్చింది.

2. అభ్యర్థుల ఎంపికలో పవన్‌కళ్యాణ్ రాజీపడకపోవడం ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించింది. పార్టీకోసం కష్టపడే వ్యక్తులకు తగిన గౌరవం ఇస్తామని చెబుతూనే.. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం. అవసరమైతే ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకుని టికెట్లు కేటాయించడం జనసేనకు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

3. యువత జనసేన వైపు మొగ్గుచూపడంతో అన్ని స్థానాల్లో ఆ పార్టీ విజయానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. పవన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉండటం ఆ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరింది.

Chennai: అన్నామలైకి కేంద్రమంత్రి పదవి? అదేగాని జరిగితే ఇక రాష్ట్రంలో అధికారపార్టీకి…

4. ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరగడం జనసేన సంపూర్ణ విజయానికి కారణంగా చెప్పొచ్చు. జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరగకపోవచ్చంటూ ఎన్నికల పోలింగ్ ముందువరకు ప్రచారం జరిగింది. కానీ కూటమి విజయం చూసిన తర్వాత ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగినట్లు తెలుస్తోంది.

5. సానుభూతి ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. 2019లో రెండుచోట్ల ఓడిపోవడం.. అధికార వైసీపీ హేళనగా మాట్లాడటంతో ఈసారి జనసేన అభ్యర్థులపై ఓటర్లు సానుభూతి కనబర్చినట్లు తెలుస్తోంది.

6. జనసేనలో ఒకరిద్దరు మినహా టికెట్ రాలేదని పార్టీపై తిరుగుబాటు చేసిన నేతలు పెద్దగా లేకపోవడంతో.. ఆ పార్టీలో అసంతృప్తజ్వాలలు వినిపించలేదు. దీంతో పార్టీ క్యాడర్ కలిసికట్టుగా జనసేన విజయం కోసం పనిచేసింది.

7. పవన్‌కళ్యాణ్‌పై ప్రజల్లో నమ్మకం పెరగడం జనసేన విజయానికి కారణంగా చూడొచ్చు. 2019 తర్వాత ఎక్కువ సమయం రాజకీయాలకు కేటాయించడం, ప్రజల కోసం తాను నిలబడతానని పదేపదే చెప్పడం. ఆ మాటలు ప్రజల్లోకి వెళ్లడం జనసేన విజయానికి కలిసొచ్చినట్లు చెప్పుకోవచ్చు.
8. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అందిచడం ప్రజల్లో జనసేనపై ఆదరణ పెరగడానికి కారణమైంది. నిస్వార్థంగా సేవ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలగడంతో జనసేనకు ఓటు వేసేందుకు ఓటరు ఆసక్తి చూపించినట్లు చెప్పుకోవచ్చు.

9.కాపుల ఓట్లు పోలరైజ్ కావడం జనసేనకు ఈ ఎన్నికల్లో కలిసివచ్చింది. 2019 ఎన్నికల్లో కాపుల ఓట్లు చీలిపోవడంతో వైసీపీకి లబ్ధిచూకూరింది. 21 నియోజకవర్గాల్లో ఈసారి కాపు ఓట్లు అధికశాతం జనసేనకు పడటంతో పాటు.. ఆ సామాజిక వర్గం ఓటర్లు ఇతర సామాజికవర్గాలను కలుపుకునే ప్రయత్నం చేయడం జనసేనకు కలిసొచ్చింది.

10. పవన్ కళ్యాణ్‌కు మోదీతో పరిచయం, కేంద్రంలో పలుకుబడి ఉండటంతో జనసేన అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలరనే అభిప్రాయంతో కొంతమంది జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. పవన్‌కు మోదీ ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు ఎన్నికల్లో కలిసొచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles