తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన Hawk Eye , TSCOP యాప్‌లు, ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన TGCSB అధికారులు కేసు నమోదు చేశారు. అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ను గుర్తించామని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. అరెస్టయిన హ్యాకర్‌కు సైబర్ నేరాల చరిత్ర ఉందని.. గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల గురించి కూడా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక డేటా లీక్ కాలేదని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. Hawkeye మొబైల్ అప్లికేషన్ డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారుల సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని తెలిపారు. బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హాక్ ఐ డేటాలోని నిర్దిష్ట విభాగాల్లోకి హ్యాకర్లు యాక్సెస్ పొంది ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు.