జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దం వరంగల్ ఎంపీ కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

నమస్తే హైదరాబాద్ హనుమకొండ

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్-2024 పార్రంభం సందర్బంగా నిర్వహించిన 3 కే రన్ కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 7 గంటలకు క్లబ్ ఆవరణ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు నిర్వహించిన 3 కే రన్ ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, ట్రెజరర్ అమర్ లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. క్లబ్ నుండి ప్రారంబమైన 3 కే రన్ ఆర్ట్స్ కాలేజ్ కు చేరుకుంది. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలను అతిధులు లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అద్యక్షతన జరిగిన సమావేశంలో వర్ంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ నిత్యం కాలంతో పోటీపడుతూ పనిచేసే జర్నలిస్టులకు క్రీడలు ఒక ఆటవిడుపని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వర్థన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజు మాట్లాడుతూ జర్నలిస్టులను తమ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని అన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. క్రీడలకు తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ తాను మేయర్ గా ఉన్నపుడు జర్నలిస్టులకు శాయశక్తులా పనిచేశానని, జర్నలిస్టులు తమ ఆరోగ్యాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ప్రెస్
క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు క్లబ్ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసిందని క్రీడా పటాలను జర్నలిస్టులు వినియోగించుకోవాలని కోరారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎంఎల్ఏ నాగరాజులు చొరవ తీసుకుని ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు ఇంటిజాగాలను ఇప్పించాలని కోరారు. వారు అందుకు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారాపు సదయ్య, కోశాధికారి అమర్, TUWJ-IJU హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, TUWJ(H)143 వరంగల్ జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ కక్కెర్ల అనిల్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గొకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు సంపెట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, బూర్ల నరేందర్, పొడిచెట్టి విష్ణువర్థన్, ఈసీ నెంబర్లు వీరగోని హరీష్, దొమ్మాటి శ్రీకాంత్, జనగాని ఆంజనేయులు, యండీ నయీంపాషా, కమటం వేణుగోపాల్, గుండెబోయిన దిలీప్, కందుకూరి సంజీవ్, నన్నపునేని భరత్, మంచాల రాజు, బాలవారి విజయ్,సతీష్ పలువురు సీనియర్ జర్నలిస్టులు హజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles