ఒక్కొక్కరు ఎన్నిసార్లు రక్తదానం చేశారో తెలుసా..?

రక్తదానం చేయండి ప్రాణదాతలుకండి.. అనే మాటలను తూచ తప్పకుండా పాటించారు ఆ గ్రామ యువత.. ఇలా రక్తదానం చేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆ యువకులు.. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదన్న సూక్తి లానే.. రక్తదానం కూడా మిన్ననే అంటూ ఆ గ్రామ యువత ఎంతోమందికి ప్రాణదాతాలుగా నిలుస్తున్నారు.. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతూ ఎంతోమందికి ఆదర్శం నిలుస్తున్నారు.. రాజు గోపాల్ పేట గ్రామ యువత.. ఇలాఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న వీరి పట్టుదల భావి తరాలకు ఆదర్శమంటూ పలువురు కొనియాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతో అవసరం పడుతుంది. అలాంటి సమయాల్లో రక్తం అందించే ప్రతి ఒక్కరూ ప్రాణదాతలే..
రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ.. సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట్ గ్రామంలోని యువకులు తమవంతుగా రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ఎప్పుడో ఒక్కసారి రక్తదానం చేయడం కాదు.. ఏకంగా ఒకొక్కరు 20 నుంచి 30 సార్లు రక్త దానం చేసిన వాళ్లే ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న తమ గ్రామ యువకులను అందరూ ప్రశంసిస్తున్నారు.
.వాస్తవానికి ప్రమాదాలు జరిగినపుడు, సకాలంలో రక్తం అందక చనిపోతున్నవారు ఎందరో ఉన్నారు.. ఇంకా అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుంది. దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది..సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య చాలావరకు తగ్గిపోయింది.. అలాంటి తరుణంలో రక్త దానం చేస్తున్న రాజ్ గోపాల్ పేట్ యువకులను చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఎంతో అభినందిస్తున్నారు.. వీరి స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శమంటున్నారు.రక్తదానం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న యువకులను ప్రత్యేకంగా అభినందించారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు.. వీరికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. రాజగోపాల్ పేట యువత ఎంతోమందికి ఆదర్శమని.. ఇదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమంలో యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles