మియాపూర్‌లో రణరంగం.. పోలీసులపై రాళ్లతో మహిళల దాడి..

హైదరాబాద్: మియాపూర్‌(Miyapur) శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్‌ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఓ దశలో మహిళలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పారిపోయి తలదాచుకున్నారు. ఈ సంఘటనలో హుడా సైట్‌ ఆఫీసర్‌ రఘుకు ఛాతి మీద రాయి తగిలి స్వల్ప గాయమైంది. ఇద్దరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. డీసీపీ వినీత్‌ ఆధ్వర్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సీఎం లేదా కలెక్టర్‌ వస్తేనేగానీ కదిలేది లేదని భీష్మించారు. ఆ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మించిన ఆలయం వద్ద దాదాపు రెండు వేల మందికి పైగా కూర్చున్నారు. అర్ధరాత్రి వరకు మహిళలెవరూ అక్కడి నుంచి కదలలేదు. పోలీసులు భారీగా చేరుకొని గస్తీ కాస్తున్నారు.
శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌, దీప్తిశ్రీనగర్‌, హెచ్‌ఎంటీ స్వర్ణపురి, మక్తా సరిహద్దులో సర్వేనెంబర్‌ 100, 101 పరిధిలో 550ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెలరోజుల క్రితం ఈ భూమిలో కొందరు మహిళలు పాగా వేయడానికి ప్రయత్నించారు. క్రమంగా వందమంది స్థల కబ్జాకు ప్రయత్నించగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు : అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. గుఇతర జిల్లాల నుంచి భారీగా రాక..

ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేసేందుకు మొదట్లో మియాపూర్‌కు అనుకుని ఉన్న రెండుమూడు బస్తీల వాసులు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రచారంతో సంగారెడ్డి, జహీరాబాద్‌, కొల్లాపూర్‌కు చెందిన వారితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ఇక్కడి హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు జనంతో కళకళలాడిపోతున్నాయి. దీనికి తోడు మియాపూర్‌, ప్రశాంత్‌నగర్‌, దీప్తిశ్రీనగర్‌లో రోడ్లపై పార్కు చేసిన వాహనాలతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతున్నది.డిసెలు ఖాళీ చేయకపోతే పీడీయాక్ట్‌ కేసులు పెడతామన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles