KCR: కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌‌ను కొట్టివేసిన హైకోర్టు.. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం..

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటుపై బీఆర్ఎస్‌ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ ను హైకోర్టు రద్దు చేసింది.. కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌ విచారించిన ధర్మాసనం దానిని డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది.. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఈనిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్‌ ప్లాంట్లపై విచారణకు ఆదేశిస్తూ ఇటీవల ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ను ఏర్పాటు చేసింది.. ఆ కమిషన్‌ను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్ వేయగా.. చీఫ్ జస్టిస్‌ బెంచ్‌ దానిని తోసిపుచ్చింది.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కమిషన్‌ ఏర్పాటులో కోర్టులో కలుగజేసుకోలేవని.. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు విచారించినట్లు ఏజీ వాదనలు వినిపించారు. విచారించిన వారిలో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారని.. – ప్రభాకర్‌రావును కూడా విచారించామని తెలిపారు. కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసిందని.. పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా సమయం కావాలని చెప్పారన్నారు. జూన్‌ 30 వరకు కమిషన్‌కు గడువు ఉందని.. జూన్‌ 15న విచారణకు రావాలని కమిషన్ కోరిందని తెలిపారు. జగదీష్ రెడ్డి నుంచి సైతం కమీషన్ వివరాలు సేకరించిం
కాగా.. ఈ పిటిషన్‌పై శుక్రవారమే వాదనలు ముగిసాయి. మాజీ సీఎం కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. ప్రస్తుత విచారణ అంతా పొలిటికల్ ఎజెండాతోనే జరుగుతోందని, కమిషన్‌ తీరూ అలాగే ఉందంటూ ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో జస్టిస్‌ నర్సింహారెడ్డి వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. అటు.. తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. నరసింహారెడ్డి కమిషన్‌ ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని, కేసీఆర్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదించారు. నిబంధనల ప్రకారమే కమిషన్‌ KCRకు నోటీసులు పంపిందన్నారు. అటు.. కమిషన్‌ విచారణ జరిపితే తప్పేముందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కమిషన్‌ రిపోర్టు వస్తే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అని అభిప్రాయపడింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. కేసు మెరిట్స్‌లోకి పోకుండా పిటిషన్‌ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్‌ చేసి.. తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles