సమాజ హితం కోరే వారు ఆనందంగా ఉంటారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

-మహాత్మ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో డ్యూయల్ డేస్కు ల పంపిణీ
-ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నమస్తే హైదరాబాద్ ( పాలకుర్తి ప్రతినిధి):
మహాత్మా హెల్పింగ్ హాండ్స్
ఆధ్వర్యంలో పాలకుర్తి కేజీబీవీ లో డ్యూయల్ డెస్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే మామిడాల.యశశ్విని రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్.మల్లన్న పాల్గొని,ప్రారంభించారు.అనంతరం మండలములోని
ప్రభుత్వ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు, అలాగే జిల్లాలోనే అన్ని కేజీబీవీ ల మొదటి ర్యాంక్ వచ్చిన వారికి మొత్తం 34 మందికి మెరిట్ ఆవార్డ్స్ అందజేశారుఈ సందర్బంగా అతిధులుమామిడాల.యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లు మాట్లాడుతూ మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ ను స్థాపించి, ఎందరికో సహాయ సహకారాలు అందిస్తున్న వ్యవస్థాపకులు గంట.రవీందర్ మరియు సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు..నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రు అన్నట్టు మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టల్ వసతి కల్పించి, వారికి విద్యాబుద్దులు నేర్పించి, వారి ఎదుగుదలకి గురుకుల పాఠశాలలు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు.. స్వచ్చంద సంస్థలు, ఎన్నారై లు, గ్రామస్తులు చేయుతను అందించి ఇంకా (అభివృద్ధి) మెరుగుపడేలా సహకరించా లన్నారు.గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ విద్య వ్యవస్థను (పటిష్టం) మెరుగు పరచడమే తమ లక్ష్యం అన్నారు. అందుకు మొన్న ప్రకటించిన బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయం మీదే ఎక్కువ బడ్జెట్ కేటాయించ మన్నారు.తాము గత ముప్పై సంవత్సరాలుగా స్వచ్చంద ప్రజా సేవలో ఉన్నామని, ప్రజా సేవకే రాజకీయాలలోకి వచ్చామన్నారు.. తాము నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికే పాటు పడుతున్నామని యశస్విని రెడ్డి అన్నారు.. పది మందికి చేసే సహాయంలో మనస్తృప్తితో పాటు ఆనందం, గౌరవం ఉంటుందన్నారు.మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాం అంతటి వారే తాను నేర్చుకున్నది ఇసుక రేణువు అంత అని చెప్పుకోచ్చారని, విద్యార్థులు ఎప్పుడు చదువు పైనే శ్రద్ద ఉంచి, ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలన్నారు.. సమయాన్ని వృధా చేసుకోవద్దని, ఇప్పుడు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే, మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడి జీవించవచ్చన్నారు.. వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, ఎంపీడీఓ రాములు, ఎమ్ .ఎల్.ఓ పోతుగంటి నర్సయ్య అధికారులు, ఉపాధ్యాయ బృందం, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles