TVS iQube | ఐ-క్యూబ్ స్కూటర్లు రీకాల్ చేసిన టీవీఎస్.. కారణమేమిటంటే..?!

TVS iQube | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐ-క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (iQube electric Scooter)ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రోయాక్టివ్ ఇన్‌స్పెక్షన్ (Proactive Inspection)’ కోసం వాటిని రీకాల్ చేస్తున్నట్లు శనివారం తెలిపింది. 2023 జూలై 10 నుంచి 2023 సెప్టెంబర్ తొమ్మిదో తేదీ మధ్య తయారైన ఐ-క్యూబ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నామని తెలిపింది. ఐ-క్యూబ్ స్కూటర్లలో ‘బ్రిడ్జి ట్యూబ్ఆఫ్ యూనిట్స్ (bridge tube of units)’ను తనిఖీ చేయడానికి కస్టమర్లను సంప్రదిస్తుందని తెలిపింది. వెహికల్ రైడ్ హ్యాండ్లింగ్ సజావుగా సాగేందుకు తనిఖీ చేస్తున్నామని, ఇందుకోసం కస్టమర్ల నుంచి ఎటువంటి చార్జీ వసూలు చేయబోమని తెలిపింది.
టీవీఎస్ ఐ-క్యూబ్ ఎస్టీ 3.4 కిలోవాట్ల వేరియంట్ సింగిల్ చార్జింగ్ చేస్తే 100 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రెండు గంటల 50 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది.

మరోవైపు 5.1 కిలోవాట్ల టీవీఎస్ ఐ-క్యూబ్ ఎస్టీ స్కూటర్ సింగిల్ చార్జింగ్ చేస్తే గరిష్టంగా 150 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. నాలుగు గంటల 18 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది.

ఐ-క్యూబ్ ఎస్టీ 7-అంగుళాల కలర్ టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, టీపీఎంఎస్, కనెక్టెడ్ ఫీచర్లు, 32 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. 3.4 కిలోవాట్ల ఐ-క్యూబ్ ఎస్టీ వేరియంట్ గరిష్టంగా గంటకు 78 కి.మీ వేగంతో ప్రయాణిస్తే, 5.1 కిలోవాట్ల ఐ-క్యూబ్ ఎస్టీ వేరియంట్ గరిష్టంగా 82 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రెండు వేరియంట్లు నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. కాపర్ బ్రాంజ్ మ్యాట్టె, కోరల్ శాండ్ శాటిన్, టైటానియాం గ్రే మ్యాట్టె, స్టార్ లైట్ బ్లూ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

న్యూ ఎంట్రీ లెవల్ 2.2 కిలోవాట్ల టీవీఎస్ ఐ-క్యూబ్ స్కూటర్ 5 అంగుళాల కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌తో వస్తుంది. వెహికల్ క్రాష్, టోయ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ స్పేస్ కలిగి ఉంటుంది. ఇక రెండు కలర్ ఆప్షన్లు – వాల్ నట్ బ్రౌన్, పెరల్ వైట్ రంగుల్లో లభిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles