Curry Leaves Benefits | కరివేపాకుతో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇంకా ఇవీ బెనిఫిట్స్..

Curry Leaves Benefits | కూరల్లో కరివేపాకు తప్పనిసరి వాడతారు. కానీ దాన్ని తినడానికి చాలా మంది ఇష్ట పడరు. భోజనం చేస్తున్నప్పుడు కరివేపాకు వస్తే తీసి పక్కన పెట్టేస్తుంటారు. కానీ, కరివేపాకు ప్రయోజనాలు తెలిసిన వారు మాత్రం దాన్ని పచ్చిగానే తింటారు. మీకు కరివేపాకు తినే అలవాటు లేకుంటే మీ శరీరానికి నష్టం చేసుకున్నట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దక్షిణ భారత వంటకాల్లో కరివేపాకు ఎక్కువగా వాడతారు. కరివేపాకుతో వంట రుచికరంగా ఉండటంతోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పలు ఆరోగ్య సమస్యలకు వ్యతిరేకంగా కరివేపాకు పని చేస్తుంది. కొలెస్ట్రాల్ కరిగించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..!
ప్రతినిత్యం కరివేపాకు ఆకులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి రక్త నాళాల్లో కొవ్వు కరిగిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. కరివేపాకు రసం కూడా తాగొచ్చు. ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతున్నది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాలతో పూర్తిగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించలేం. ఈ నేపథ్యంలో కరివేపాకు నానబెట్టిన నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడంతో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

అంతేకాదు.. కరివేపాకులో ‘ఎ’ విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ల సమస్యలు తగ్గుతాయి. దృష్టికూడా మెరుగవుతుంది. ఇతర కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు, బయటి ఆహారం తినడం వల్ల కాలేయం దెబ్బ తింటున్నది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కరివేపాకు ఖచ్చితంగా తీసుకోవాలి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ దెబ్బ తినకుండా కాపాడతాయి. జీర్ణ క్రియతోపాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కడుపులో మంట నివారిస్తుంది. కరివేపాకు తినే వారిని రక్త హీనత సమస్యల నుంచి దూరం చేస్తుంది. ప్రత్యేకించి మహిళలకు నెలసరి సమయంలో నొప్పి నివారణకు ఉపకరిస్తుంది. ఐరన్ కంటెంట్ పంపిణీ చేయడంలో కరివేపాకు ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles