* రామన్నగూడెంలో కూలిన పురాతన మర్రిచెట్టు
* లేచిపోయిన రేకుల షెడ్డు
* ఆందోళనలో గౌడన్నలు
నమస్తే హైదరాబాద్ తుంగతుర్తి :
తుంగతుర్తి మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం గాలి దుమారం బీభత్సాన్ని సృష్టించింది. అతివేగంతో వీచిన గాలులతో మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో గీత కార్మికుల జీవనోపాధిలో భాగమైన అతి పురాతన మర్రిచెట్టు నేల కొరగడంతో పాటు పక్కనే ఉన్న గీత కార్మికులు మోకు..ముస్తాదులు భద్రపరచుకునే రేకుల షెడ్డు మొత్తం గాలి దుమారానికి లేచిపోయింది. దీంతో వారు నిల్వ నీడ లేక నిరాశ్రయులయ్యారు. మండలంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారుల గుండా చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో పాటు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి బీభత్సంతో పూర్తిగా ధ్వంసం అయినా రేకుల షెడ్డును ప్రభుత్వం నిర్మించి గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు.