సమాజంలో ఎవరు కూడా ఒకరి కంటే ఎక్కువ కాదు

సమాజంలో ఎవరు కూడా ఒకరి కంటే ఎక్కువ కాదు, ఒకరి కంటే తక్కువ కాదు అనే భావనతో అందరికి ఓటు హక్కు కల్పించిన ఘనత డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ ది – ఎస్. సైదులు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఘట్కేసర్ పి ఎస్)

ఘట్కేసర్ (నమస్తే హైదరాబాద్):
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 172వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్యఅతిథిగా ఎస్. సైదులు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఘట్కేసర్ పి ఎస్) విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

సైదులు మాట్లాడుతూ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో చదివిన మేధావి, అంటరానితనం, అస్ప్రుశ్యత నిర్ములనకు అయన జీవితాంతం పోరాటం చేసారు.. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశంగా పేరు తెచ్చుకుంది అంటే అది డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే. సమాజంలో ఎవరు కూడా ఒకరి కంటే ఎక్కువ కాదు, ఒకరి కంటే తక్కువ కాదు అనే భావనతో అందరికి ఓటు హక్కు కల్పించిన ఘనత అంబెడ్కర్ ది. అంబేద్కర్ మహిళలు కోసం జీవితాంతం పోరాటం చేసారు. అంబెడ్కర్ భారత దేశంలో సబ్బండ వర్గాల నాయకుడు అని తెలిపారు. అందరూ కూడా అంబెడ్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలి అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో మేకల దాస్ (కన్వీనర్, ఎస్సి సెల్, కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ మల్కాజిగిరి), సంజీవ గౌడ్, ఆమడ బాల్రాజ్, బండారి రాందాస్, కే.నర్సింగ్ రావు, ఇరిటం శ్రీనివాస్(ప్రధాన కార్యదర్శి, అంబెడ్కర్ యువజన సంగం), మీసాల రాజేష్ కుమార్(అద్యేక్షులు, ఎస్సి సెల్, బిఆర్ఎస్ పార్టీ- పోచారం మున్సిపాలిటీ), మేకలా నర్సింగ్ రావు, కె.సత్యం, ఎ.రామకృష్ణ, పి.నారాయణ, మహేష్ (కానిస్టేబుల్), కె.నర్సింగ్ రావు, వై.వెంకటేశ్వర్లు, సి.సుధాకర్, జి.అంజయ్య, ఎ.రామకృష్ణ, రూపేష్ కుమార్, ఎస్.కృష్ణం రాజు, సి.ఆనంద్, డి.శ్రీనాథ్, సి.నిఖిల్, సి.ఉపేందర్, ఈ.విష్ణు, జి.సచిన్, డి.భరత్, జి.ప్రవీణ్, జె.అఖిల్, జే.సాయి చరణ్, బి.వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles